యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా శేషులు

27 Mar, 2023 00:10 IST|Sakshi

నెల్లూరు(టౌన్‌): యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా వీవీ శేషులు నియమితులయ్యారు. నెల్లూరులోని జేఎస్‌ ట్రస్ట్‌లో యూటీఎఫ్‌ జిల్లా 48వ కౌన్సిల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడిగా అచ్చయ్య, విజయకుమారి, ప్రధాన కార్యదర్శిగా చలపతిశర్మ, కోశాధికారిగా మురళీధర్‌రావు నియమితులయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌ వ్యవహరించారు. అనంతరం ఆర్థిక నివేదిక, జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం ఆడిట్‌ నివేదిక ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

మరిన్ని వార్తలు