వైద్య విద్యార్థి ఆత్మహత్య

27 Jun, 2023 11:32 IST|Sakshi

నెల్లూరు: పట్టణంలోని పాతూరు పుచ్చలపల్లివీధికి చెందిన దింటకుర్తి లోకేశ్‌ (21) కర్నూలు విశ్వభారతి మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. బ్రహ్మానందరావు అనే వ్యక్తి టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గృహిణి. వారి పిల్లల్లో ఒకరైన లోకేశ్‌ విశ్వభారతి మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

కుమార్తె హైదరాబాద్‌లో ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మానందరావుది మధ్య తరగతి కుటుంబం. ఎంతో కష్టపడి కొడుకును చదివిస్తున్నాడు. వైద్యుడిగా చేతికి అందివస్తాడనుకున్న తరుణంలో లోకేశ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి తల్లిదండ్రులతోపాటు బంధువులు కర్నూలుకు తరలివెళ్లారు.

మరిన్ని వార్తలు