ఓటరు జాబితాలను పారదర్శకంగా రూపొందించాలి

18 Nov, 2023 00:08 IST|Sakshi
ఓటరు జాబితాలను పరిశీలిస్తున్న ఆర్వో బాపిరెడ్డి

కోవూరు: ఓటరు జాబితాలను పారదర్శకంగా రూపొందించాలని కోవూరు నియోజకవర్గ ఆర్‌ఓ బాపిరెడ్డి బీఎల్వోలను ఆదేశించారు. స్థానిక సంఘమిత్ర కార్యాలయంలో తహసీల్దార్‌ ఎం పద్మజ ఆధ్వర్యంలో బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బీఎల్వోలు వారికి కేటా యించిన విధులు, బాధ్యతల విషయంలో అలసత్వం వహించకుండా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఫాం–6, 7, 8కు సంబంధించి 11 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని నిశితంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మృతులకు సంబంధించిన ఓట్లను తొలగించాలన్నారు. ఓట్ల తొలగింపు సమయంలో ఒకటికి రెండు సార్లు నిశితంగా పరిశీలించాలన్నారు. ఓటరుకు సంబంధించిన ఫొటోల అప్‌లోడ్‌ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డబుల్‌ ఎంట్రీలు లేకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఇలియాజ్‌ , ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మధుసూదన్‌రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రమణయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ సుధ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు