రీ సర్వే పకడ్బందీగా సాగాలి

5 Mar, 2023 00:58 IST|Sakshi
దేమకేతేపల్లి వద్ద చెక్‌పాయింట్‌లను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

సోమందేపల్లి/చిలమత్తూరు: ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ కింద జిల్లాలో చేపట్టన రీ సర్వే పకడ్బందీగా సాగాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన సోమందేపల్లి మండలంలోని పందిపర్తి, చిలమత్తూరు మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీలోని యగ్నిశెట్టిపల్లి గ్రామాల్లో పర్యటించారు. తొలుత పందిపర్తి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన...అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. రీ సర్వేకు సంబంధించి రైతులకు ముందస్తుగా నోటీసులివ్వాలన్నారు. ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం సోమందేపల్లి మండలంలోని మాగే చెరువు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చెక్‌పాయింట్ల పరిశీలన..

అనంతరం చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ యగ్నిశెట్టి పల్లి గ్రామ పొలాల్లో సర్వే చెక్‌ పాయింట్‌(సీపీ)లను కలెక్టర్‌ పరిశీలించారు. రీ సర్వేలో భూములు సరిహద్దులు ఎలా గుర్తించారో సర్వేయర్లును అడిగి తెలుసుకున్నారు. ఒక చెక్‌ పాయంట్‌ను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మొరంపల్లి వద్ద గ్రానైట్‌ పరిశ్రమల్లో ఆర్డర్‌ ఇచ్చిన హద్దురాళ్ల కొలతలు తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ కార్తిక్‌, తహసీల్దార్లు నాగరాజు, మురళీకృష్ణ, చిలమత్తూరు ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రామ్‌కుమార్‌, సోమందేపల్లి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల సర్వేయర్లు, ఉపాధి హామీ అధికారులు ఉన్నారు.

కూలీలందరికీ ‘ఉపాధి’ కల్పించాలి

కొత్తచెరువు: కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో ‘అమృత్‌ సరోవర్‌ మహోత్పవ్‌’ కార్యక్రమంలో భాగంగా చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పీడీ విజయేంద్రప్రసాద్‌, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు