‘సీమ’లో హైకోర్టు టీడీపీకి సుముఖమేనా?

30 Mar, 2023 00:44 IST|Sakshi
ఏజీపీ భాస్కరరెడ్డి, పెనుకొండ

ఈ విషయంలో లోకేష్‌ స్పష్టతనివ్వాలి

న్యాయవాదుల సంఘం రాష్ట్ర

ఉపాధ్యక్షుడు భాస్కరరెడ్డి డిమాండ్‌

పెనుకొండ: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ సుముఖంగా ఉందో లేదో అనే విషయంపై నారా లోకేష్‌ స్పష్టతనివ్వాలని న్యాయవాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని కోర్టు బార్‌ రూంలో బుధవారం ఆయన మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విషయమై పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ను న్యాయవాదులు కలసి చర్చించగా, తాను ఏమీ చెప్పలేనని దాటవేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉమ్మడి అనంతపురం జిల్లా దాటేలోగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనే కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారన్నారు. రాయలసీమకు న్యాయం చేయాలని భావిస్తే వెంటనే సీమ ప్రజలకు, న్యాయవాదులకు విషయాన్ని తెలియజేయాలన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రజలు దగాకు గురయ్యారని, మళ్లీ మోసం చేయాలని చేస్తే వారి ఆగ్రహానికి గురవుతారని స్పష్టం చేశారు. ఒక లక్ష్యం లేకుడా లోకేష్‌ పాదయాత్ర చేయడం అర్థరహితమన్నారు.

దత్తతకు ఇద్దరు చిన్నారులు

అనంతపురం సెంట్రల్‌: మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులను దత్తతకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. రక్తసంబంధీకులు తగిన ఆధారాలతో 30 రోజుల్లోగా సంప్రదించాలని, లేకపోతే నిబంధనలకు అనుగుణంగా దత్తత ఇస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు