●హరే రామ.. హరే కృష్ణ

30 Mar, 2023 00:44 IST|Sakshi
పట్టుచీరపై ఫొటో ఫ్రేంగా రాముడు కృష్ణుల చిత్రాలు

హిందూపురం: పట్టుచీరల డిజైన్లలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జిల్లా నేతన్నలు శ్రీరామ నవమి సందర్భంగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. త్రేతాయుగంలో రాముడు...ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఒక్కరేనని చాటుతూ హిందూపురం ముద్దిరెడ్డిపల్లి ఆర్‌సీకే క్రియేషన్స్‌ నిర్వాహకులు అశ్వర్థనారాయణ, నారాయణస్వామి, ఆనంద్‌ పట్టుచీరపై రామకృష్ణల చిత్రాలను డిజైన్‌ వేశారు. పట్టుచీరపై ప్రత్యేక పట్టుపోగులతో తయారు చేసిన రామకృష్ణుల చిత్రాల బోర్డర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫొటో ఫ్రేం బోర్డర్‌లో చిత్రాలతోపాటు ‘హరే రామ.. హరే కృష్ణ..రామ రామ హరే హరే...హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే’ అనే అక్షరాలు కూడా చిత్రించారు. ఇందుకోసం ధర్మవరం డిజైనర్లు శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకట్రాది సహకారం తీసుకుని నెలరోజులపాటు శ్రమించి పవర్‌లూమ్స్‌పై చీర నేసినట్లు వారు వెల్లడించారు. దేవతామూర్తుల చిత్రాలతో తయారు చేసిన పట్టుచీరను శ్రీరామనవమి పండుగ సందర్భంగా ముద్దిరెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి, పాండురంగస్వామి ఆలయానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.

మరిన్ని వార్తలు