2న మెగా జాబ్‌ మేళా

29 Nov, 2023 01:24 IST|Sakshi

కదిరి అర్బన్‌: అన్నమయ్య జిల్లా రాయచోటిలో డిసెంబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్‌ ఖయ్యూమ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు వంద మల్టీనేషనల్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లమో, బీటెక్‌, పీజీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7989888299, 9676706976 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

4న సర్టిఫికెట్ల పరిశీలన

లేపాక్షి: ఏపీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిస్‌ షిప్‌ కోసం ఆన్‌లైన్‌లో ఈ నెల 1 నుంచి 15 వరకూ దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల సర్టిఫికెట్లను కర్నూలు ఆర్టీసీ కార్యాలయంలో డిసెంబరు 4న పరిశీలిస్తారని జిల్లా ఐటీఐ కన్వీనర్‌ రాయపురెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట కార్యక్రమం సాగుతుందన్నారు. డీజిల్‌ మెకానిక్‌, మోటర్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని కోరారు.

ఇంట్లో చోరీ

గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని ఉమామహేశ్వరనగర్‌కు చెందిన రోషమ్మ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి చొరబడిన దుండ గులు బీరువాలోని అర తులం బంగారు కమ్మలు, రూ.40 వేలు నగదు అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు