వ్యక్తి దుర్మరణం

30 Nov, 2023 00:44 IST|Sakshi
మృతుడు నారాయణ

అమడగూరు: టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలం కుమ్మరోళ్లపల్లికి చెందిన వల్లిపి శివన్న (56) తన బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి అవసరమైన కూరగాయలను బుధవారం ఉదయం కర్ణాటక ప్రాంతం దిబ్బూరపల్లిలో కొనుగోలు చేసుకుని ద్విచక్రవాహనంపై సొంతూరుకు బయలుదేరాడు. అమడగూరు మండలం మలకవారిపల్లి తండా సమీపంలోకి చేరుకోగానే మలుపు వద్ద ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ఢీ కొనడంతో శివన్న అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన్లు ఎస్‌ఐ బలరామయ్య తెలిపారు.

విద్యుదాఘాతంతో

వృద్ధుడి మృతి

ధర్మవరం రూరల్‌: మండలంలోని రేగాటిపల్లికి చెందిన నారాయణ(60) బుధవారం ఉదయం విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తన ఇంటి వద్ద కరెంట్‌ మోటారు ద్వారా నీళ్లు పట్టేందుకు సిద్ధమైన ఆయన ఇనుప గేటు పట్టుకుని విద్యుత్‌ వైర్లు మారుస్తుండగా షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై ధర్మవరం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

యువతి ఆత్మహత్య

కనగానపల్లి: కడుపు నొప్పి తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం పాతపాళ్యం కొత్తూరుకు చెందిన లక్ష్మీరెడ్డి, జ్యోతి దంపతుల కుమార్తె రూప (23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా నొప్ప తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె బుధవారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కనగానపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు