‘జగనన్నకు చెబుదాం’కు 62 అర్జీలు

12 Oct, 2023 04:40 IST|Sakshi
తులసీదళార్చన చేస్తున్న అర్చకులు

సంతబొమ్మాళి: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన జగనన్నకు చెబు దాం కార్యక్రమంలో 62 అర్జీలు వచ్చాయి. మూలపేట పోర్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాజపురం రోడ్డు దగ్గర కంకర వేయడం వల్ల వేలాది ఎకరాల వరిపంట ముంపునకు గురవుతుందని జిల్లా కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోత మధుసూదనరావు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌కు ఫిర్యాదు చేశారు. రావివలస రోడ్డుకు మరమ్మతులు చేయాలని, సంతబొమ్మాళి నుంచి హ నుమంతు నాయుడుపేట వరకు జంగిల్‌ క్లి యరెన్స్‌ చేయాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. 11 ఎల్‌.కోటపాడు వంశధార సైఫన్‌ మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరా రు. మేఘవరం వంశధార కాలువకు మరమ్మ తులు చేపట్టి నీరు తక్షణం అందించాలని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌, సబ్‌ కలెక్టర్‌ నూరల్‌కమార్‌, తహసీల్దార్‌ చలమయ్య, ఎంపీడీఓ ప్రేమలీల, ఎంపీపీ రాజేశ్వరి, జెడ్పీటీసీ వసంతరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీకూర్మనాథునికి తులసీ దళార్చన

గార: శ్రీకూర్మనాథునికి వైభవంగా బుధవారం తులసీ దళార్చన నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న ధర్మప్రచార వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు తులసీ దళార్చన నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులను వేంచింపజేసి ప్రత్యేక పూజల అనంతరం తులసీదళాలతో పూజలు నిర్వహించారు. ఆల య ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు దాసుబాబు, శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, లక్ష్మణాచార్యులు, శ్రీమన్నారాయణ, మురళీకృష్ణమాచార్యులు తదితరులు ఈ అర్చనలో పాల్గొన్నారు. ముందగా వేదమంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో తులసీ దళాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఈఓ జి.గురునాధం, నర్సుబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు