సాధికార బస్సుయాత్ర షెడ్యూల్‌ విడుదల

14 Nov, 2023 01:32 IST|Sakshi

నరసన్నపేట: నరసన్నపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బస్‌యాత్ర షెడ్యూల్‌ను ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఆ మేరకు.. నరసన్నపేట, పోలాకి మండలాల్లో బస్సు యాత్ర సాగుతుంది. బుధవా రం ఉదయం 12 గంటలకు మబగాంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారు. 12.30 నుంచి 1.30 వరకూ లంచ్‌ బ్రేక్‌, 1.30 కి మబగాంలో బస్‌యాత్ర ప్రారంభవుతుంది. 1.45 గంటలకు కిళ్లాం చేరుకుంటుంది. 2 గంటలకు ఈదులవలస కూడలికి వస్తుంది. 2.15 నరసన్నపేట టౌన్‌లోని దేశవానిపేట కూడలికి, 2.30 కి పల్లిపేట జంక్షన్‌కు బస్‌ యాత్ర చేరుకుంటుంది. 2.45 గంటలకు వైఎస్సార్‌ కూడలి వద్దకు వస్తుంది. అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం లక్ష్మీ టాకీస్‌ వద్ద సభా ప్రాంగణానికి 3 గంటలకల్లా చేరుకుంటారు. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సభ నిర్వహిస్తారు.

ఆటో ఢీ: వ్యక్తికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం క్రైమ్‌ : స్థానిక డేఅండ్‌నైట్‌ కూడలి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో తీవ్రగాయాలైనట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ పీవీ రమణ పేర్కొన్నారు. ఎస్‌ఐ చెప్పిన వివరాల మేర కు రాయివీధికి(పెదరెల్లివీధి సమీపంలో) చెందిన పెంట కృష్ణ (47) డేఅండ్‌నైట్‌ కూడలి సమీపంలో ఉన్న ట్రెండ్స్‌ నుంచి వరం మోటార్స్‌ వైపు డివైడర్‌పై నుంచి రోడ్డు క్రాస్‌ చేస్తున్నాడు. అదే సమయంలో డేఅండ్‌నైట్‌ నుంచి ఏడురోడ్ల కూడలికి వెళ్తున్న ఆటో ఢీకొనడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపో యాడు. దీంతో కృష్ణకు తల వెనుక బలమైన గాయం తగలడమే కాక పెదవి కూడా చిట్లింది. కాసేపటికే ఆయన స్పృహ కోల్పోవడంతో హు టాహుటిన ఆటోలో రిమ్స్‌కు తరలించారు. గాయం పెద్దది కావడంతో రిమ్స్‌ నుంచి అతని కుటుంబ సభ్యులు మెడికవర్‌కు తీసుకువెళ్లారు. భార్య మంగమ్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమణ తెలిపారు.

మరిన్ని వార్తలు