చూస్తూ ఉండగానే పేక మేడలా..

30 Jul, 2020 07:25 IST|Sakshi
కూలడానికి సిద్ధంగా ఉన్న భవనం.. ,కూలి అదృశ్యమైన దృశ్యం

బెంగళూరులో కూలిన భవనం  

కర్ణాటక,శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం క్షణాల్లో కుప్పకూలింది. మంగళవారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే పేకమేడలా నేలరాలింది. ప్రమాదాన్ని ఊహించి జనం ముందే భవనాన్ని ఖాళీ చేయడంతో పెద్ద గండం తప్పినట్లయింది.  వివరాల్లోకి వెళితే.. నగరం నడిబొడ్డున ఎస్‌సీ రోడ్డు, కపాలి థియేటర్‌ వెనుకభాగంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. థియేటర్‌ను కూల్చి కొత్త భవనం నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే నాలుగు అంతస్తుల భవనం ఉండగా దానిని లాడ్జ్, హోటల్‌గా ఉపయోగించేవారు.

ఇటీవల భారీ వర్షాలు కురవడం, భవనం సమీపంలోనే కొత్త కట్టడానికి తవ్వకాలు జరుగుతుండడంతో ఈ పాత భవంతి కూలినట్లు భావిస్తున్నారు.  ఈ సంఘటనను కొందరు స్థానికులు తమ మొబైల్‌ఫోన్లలో చిత్రీకరించగా, వైరల్‌ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పక్క భవనం ఇంజనీర్‌ ముస్తఫాను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. మేయర్‌ గౌతంకుమార్‌ జైన్‌  పరిశీలించారు.   

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు