రైల్వే ట్రాక్‌పై చిరుత మృతదేహం

6 Aug, 2020 12:40 IST|Sakshi

భువనేశ్వర్‌: సుందరగడ్‌ జిల్లా హిమగిర్‌ సమితి రాంపియా గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చిరుతపులి మృతి చెందింది. స్థానికులు చిరుత మృతదేహాన్ని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్‌వో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. హిమగిర్‌ అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి వచ్చి రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైతు ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

చిరుత దాడిలో నలుగురికి గాయాలు 
రాంపియా గ్రామంలో మంగళవారం రాత్రి ఒక మహిళపై చిరుత దాడి చేసి గాయపరిచింది. ఆమెను కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురిపై చిరుత దాడి చేయడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా హిమగిర్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతన్నారు. రాంపియా అటవీ ప్రాంతం నుంచి తరచూ పులులు, ఏనుగులు, కూృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయని, కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తులపై దాడి చేయడంతో ఆగ్రహించిన ప్రజలు చిరుతను చంపి రైల్వే ట్రాక్‌పై పడేసి ఉంటారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు