డేంజర్‌ గేమ్‌: 23వ అంత‌స్తు చివ‌రి నుంచి..

12 Aug, 2020 18:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: అస‌లే లాక్‌డౌన్‌.. విశ్రాంతికే విసుగొచ్చేంత విరామం దొరికింది. ఇంట్లో ఎంత‌సేప‌ని ఖాళీగా కూర్చుంటాం.. ఏదైనా ఆట ఆడుకుందామ‌నుకున్నారు త‌మిళ‌నాడులోని చెన్నైకు చెందిన అన్నాచెల్లెళ్లు. కానీ మామూలు ఆట ఆడుకుంటే కిక్కు ఉండ‌ద‌నుకున్నారో ఏమో కానీ ఏకంగా ప్రాణాల‌నే రిస్క్‌లో పెట్టే గేమ్ ఆడారు. ఎవ‌రికి ఎక్కువ ధైర్యం ఉందో చూసుకుందామ‌ని పోటీ పెట్టుకున్నారు. అన్న క‌న్నా త‌నే ధైర్య‌వంతురాల‌ని నిరూపించుకునేందుకు ప‌ద్నాలుగేళ్ల బాలిక‌ 23వ అంత‌స్థు కొన నుంచి న‌డిచింది. (జూమ్ క్లాస్‌లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?)

అలా మూడు సార్లు న‌డుస్తూ ప్ర‌మాదంతో ప్ర‌యాణం చేసింది‌. ఈ భ‌యాన‌క సాహ‌సాన్ని కొంద‌రు కెమెరాలో చిత్రీక‌రించ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏమాత్రం కాలు జారినా ప‌రిస్థితి ఘోరంగా ఉండేద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆగ‌స్టు 6న‌ చెన్నైకు స‌మీపంలోని కేళంబ‌క్క‌మ్‌లో చోటు చేసుకున్న‌ ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పోలీసులు మైన‌ర్ బాలిక‌ను, ఆమె సోద‌రుడిని హెచ్చ‌రించి వ‌దిలేశారు. (రజనీకాంత్‌ క్షమాపణ.. నిజమేనా?)

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా