చెంపలు వాయించింది

1 Aug, 2020 07:50 IST|Sakshi
యువకుడి కాలర్‌ పట్టుకున్న యువతి

కర్ణాటక,మండ్య : మండ్య నగరం నుంచి పాండవపురకు వెళుతున్న కేఎస్‌ ఆర్‌టీసీ బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి చెంప వాయించింది ఓ యువతి. ప్రస్తుతం ఈ వీడియో కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మండ్య నగరం నుంచి పాండవపురకు యువతి గురువారం బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనక సీటులో కూర్చున్న యువకుడు యువతిని తాకడం చేశాడు. ఓపిగ్గా చూసిన యువతి పరిస్థితి శ్రుతి మించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో సదరు యువకుడి చెంప చెల్లున వాయించింది. నీ చెల్లి, తల్లి ఉంటే ఇలాగే చేస్తావా అంటూ అతడిని ప్రశ్నించింది. బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే యువకుడు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు.  

మరిన్ని వార్తలు