తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యం

25 Feb, 2023 10:06 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రాంజీ గౌతమ్‌

బీఎస్పీ ఎంపీ రాంజీగౌతమ్‌

కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌ ఎంపీ రాంజీగౌతమ్‌ అన్నారు. శుక్రవారం కోదాడలో జరిగిన ఆ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, దేశంలో బీజేపీ రెండు ఒకటేనన్నారు.

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రెండు ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే తానే పార్లమెంట్‌లో పోరాడానని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంబేద్కర్‌ పేరు చెప్పి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోసులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మందా ప్రభాకర్‌, బాలస్వామి, దయానందరావు, పిల్లుట్ల శ్రీనివాస్‌, బొడ్డు కిరణ్‌, మల్లేశ్‌యాదవ్‌, కాంపాటి శ్రావణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు