గంజాయి తాగుతున్న ఏడుగురు యువకుల అరెస్ట్‌

4 Nov, 2023 01:28 IST|Sakshi

కోదాడరూరల్‌ : గంజాయి తాగుతున్న ఏడుగురు యువకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని దోరకుంట గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామశివారులో గంజాయి తాగుతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఏడుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువు మధ్యలో మానేసి గంజాయికి అలవాటుపడినట్లు ఒప్పుకున్నారని ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు.

భద్రాచలంలో కొనుగోలు చేసి..

గ్రామానికి చెందిన మధు, నితీష్‌, సమీర్‌, కిశోర్‌లు వినాయకచవితి ముందు స్నేహితుడి ఆటోలో భద్రాచలం వెళ్లి అక్కడ ఓ వ్యక్తి వద్ద 4కేజీల గంజాయిని రూ.6వేలకు కొనుగోలు చేశారు. గంజాయిని గ్రామశివారులో గల ఓ సెల్‌టవర్‌ వద్ద దాచిపెట్టారు. గ్రామానికి చెందిన రాకేష్‌, నితీష్‌, రమేష్‌ 2కేజీలను కొనుగోలు చేయగా మిగిలిన రెండు కేజీల గంజాయిని గ్రామశివారులోనే ఉంచి జగ్గయ్యపేటకు చెందిన గోపితో కలిసి రోజు అక్కడికి వెళ్లి విల్స్‌క్లాసిక్‌ సిగరేట్‌లలో పెట్టుకొని తాగుతున్నట్లు తెలిపారు. వారి వద్ద 1.250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు