రూ.10.18 కోట్ల నగదు స్వాధీనం

11 Nov, 2023 01:48 IST|Sakshi

నల్లగొండ క్రైం : ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రూ.10.18కోట్ల నగదు, రూ.27కోట్ల విలువైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో మూడు చెక్‌ పోస్టులతో పాటు జిల్లాలో మరో 10 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నారు. రూ 50వేలకు మించి ఆధారాలు లేకుండా తరలించే నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తంగా రూ. 10.18కోట్ల నగదు, రూ.20లక్షల విలువైన మద్యం, రూ.12.50లక్షల విలువైన గంజాయి. 35 కిలోల బంగారం, 197 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతి రోడ్డులో చెక్‌ పోస్టు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

రంగంలోకి కేంద్ర బలగాలు

ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు నాలుగు కేంద్ర కపెనీ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపనీలో 160 మంది సిబ్బంది ఉంటారు. 1200 మంది జిల్లాకు చెందిన పోలీస్‌ బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : ఎస్పీ

ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర సరిహద్దు వాడపల్లి, అడవిదేవులపల్లి, సాగర్‌ వద్ద చెక్‌ పోస్టులతోపాటు జిల్లా లోపల పలు చెక్‌ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నాం. నగదు, మద్యం, గంజాయి, బంగారం, ఇతర విలువైన వస్తువులు తరలించకుండా నివారిస్తున్నాం.

ఫ 35 కిలోల బంగారం, 197 కేజీల వెండి కూడా..

ఫ మొత్తంగా 27కోట్ల విలువైన ఆభరణాలు పట్టివేత

మరిన్ని వార్తలు