అడయార్‌లో హ్యాండ్‌ ఇంజురీ క్లినిక్‌ ప్రారంభం

7 Mar, 2023 01:52 IST|Sakshi

సాక్షి, చైన్నె: గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ చైన్నె అడయార్‌లో 24 గంటల సేవల నిమిత్తం హ్యాండ్‌ ఇంజురీ క్లీనిక్‌ను సోమవారం ఏర్పాటు చేసింది. సంక్లిష్ట, సూక్ష్మ శస్త్ర చికిత్సల నిర్వహణకు తొమ్మిది మంది వైద్య నిపుణులను ఇక్కడ నియమించారు. ఈ క్లినిక్‌ను ఐఏఎస్‌ అధికారి అలెక్స్‌ పాల్‌ మీనన్‌, గ్లెనెగల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ హెచ్‌ఓడీ సెల్వ సీతారామన్‌, సీఈఓ అలోక్‌ ఖుల్లర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. క్లీనిక్‌ లోగో, కరపత్రాలను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు