లవ్‌లో ఓడిపోవడం కూడా మంచిదే

15 Mar, 2023 00:50 IST|Sakshi

తమిళ సినిమా: సాధారణంగా ప్రేమలో విఫలమైతే ఎవరైనా బాధను వ్యక్తం చేస్తుంటారు. మోసపోయానని ఆరోపణలు చేస్తుంటారు. అయితే నటి ఆద్మిక ఇందుకు కాస్త భిన్నమనే చెప్పాలి. హిప్‌ హాప్‌ తమిళాకు జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం అందుకోవడంతో ఆమెకు వరసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి.


అలా విజయ్‌ ఆంటోని సరసన కోటియిల్‌ ఒరువన్‌ చిత్రంతో పాటు కాటేరి, నరకాసురన్‌ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నైనంబాదే చిత్రంలో నటించింది. క్రైమ్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నటి ఆద్మిక తన ప్రేమ గురించి చెబుతూ ఈ విషయంలో తనకు చేదు అనుభవం ఎదురైంది అని పేర్కొంది.

ఒక వ్యక్తిని ప్రేమించానని, అయితే అది ఎంతోకాలం కొనసాగలేదని చెప్పింది. అతనే బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయాడనీ చెప్పింది. అలా ప్రేమ విఫలం కావడంతో కొన్ని రోజులు రాత్రి వేళల్లో ఏడ్చానని చెప్పింది. అయితే అప్పుడు లవ్‌ ఫెయిల్‌ అవడంతో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాననీ పేర్కొంది. ఇకపై ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉంటానని, తనకు రగ్డ్‌ వ్యక్తి, స్మార్ట్‌ గా ఉండే వ్యక్తి వద్దని సాధారణంగా ఉండే మంచి మనసున్న వాడైతే చాలని చెప్పింది. కాగా ఈ రోజుల్లో పేరు, డబ్బు ప్రధాన అంశాలుగా ఉన్నాయని అభిప్రాయపడింది. తాను మాత్రం తొలి ప్రాధాన్యం డబ్బుకే ఇస్తానని స్పష్టం చేసింది. దీనికి కారణం ధనం అన్నదే నిజం అని ఆద్మిక చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు