కాలం చెల్లిన 529 బస్సులకు సెలవు

15 Mar, 2023 00:52 IST|Sakshi

కొరుక్కుపేట: కాలం చెల్లిన 529 పాత బస్సులను వినియోగించకూడదని చైన్నె నగర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. వివరాలు.. జాతీయ వాహనాల చట్టం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం రవాణా సంస్థలో 15 ఏళ్ల నాటి బస్సుల నిర్వహణను నిలిపివేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ మరమ్మతులు చేయాల్సిన బస్సుల జాబితాను సిద్ధం చేసిన దాని ప్రకారం ఇప్పటి వరకు 529 బస్సులు 15 ఏళ్లు పైబడినవిగా గుర్తించారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈ బస్సుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్నారు.

చైన్నెలో 2వ రోజూ పాల కొరత

కొరుక్కుపేట: చైన్నెలో పాల కొరత వరుసగా రెండోరోజు కూడా కొనసాగింది. ఈ విషయాన్ని తమిళనాడు మిల్క్‌ ఏజెంట్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నుసామి ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. వివరాలు.. రాజధాని నగరంలో నెలవారీ కార్డు హోల్డర్లు, పంపిణీదారులకు 63 వాహనాల ద్వారా రోజుకు 4 లక్షల లీటర్లకు పైగా పాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్య, పాల సేకరణ తక్కువగా ఉండడంతో షోళింగనల్లూర్‌ డెయిరీ రెండు రోజుల క్రితం మూతపడింది. ఫలితంగా చైన్నెలోనే కాకుండా సెంట్రల్‌లోని పలు ప్రాంతాల్లో పాత కొరత తీవ్రమైంది. షోలింగనల్లూరు డెయిరీ ఫారం నుంచి పంపిణీ చేయాల్సిన ఆవు పాల ప్యాకెట్లను కూడా మంగళవారం మధ్యాహ్నానికి అందజేయడం గమనార్హం. కాగా ఈ పరిస్థితికి పాల ఉత్పత్తి, డెయిరీ వనరుల అభివృద్ధి శాఖ అధికారుల నిర్లక్షమే కారణమని తమిళనాడు మిల్క్‌ ఏజెంట్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి కూడా పాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్‌రీల్‌

మరిన్ని వార్తలు