తమిళసినిమా: నటి తాజా అందాలను చూస్తుంటే ఇంత అందం ఎందమ్మా. కీర్తమ్మా అని పాడాలనిపిస్తోందా ? అవును మరి మహానటి అందాలతో ఆడేసుకుంటుంటే ఆమెను అభిమానించే వారికి అలానే అనిపిస్తుంది. మొదట్లో లంగా ఓణీ, చుడిదార్, అంతకుమించి చీరకట్టులో పక్కింటి అమ్మాయిల కనిపించి అందరి మనసులను దోచుకున్న నటి ఈ బ్యూటీ. అలానే మహానటి చిత్రంలో కనిపించి మెప్పించిన కీర్తిసురేష్ సర్కారీ వారి పాట చిత్రం ముందు వరకు అలాంటి ఇమేజ్‌నే కొనసాగించింది.
తమిళంలో రజనీకాంత్ చెల్లెలుగా అన్నాత్తే చిత్రంలో ఉట్టిపడే సంప్రదాయ యువతిగా కనిపించింది. ఆ తర్వాతే అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది. అలా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఇటీవల ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఫొటోషూట్‌లో కనువిందు చేసే అందాలతో ఫొటోలను తీయించుకుంది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కుర్రకారును నిద్రకు దూరం చేస్తున్నాయి. అలా వస్తే ప్రస్తుతం కీర్తిసురేష్ అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో నాలుగు తమిళ్, రెండు తెలుగు చిత్రాలు కావడం గమనార్హం. తెలుగులో నాని నటించిన దసరా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
కాగా చిరంజీవికి చెల్లెలిగా బోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళ్లో అజిత్, శ్రుతిహాసన్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన వేదాళం చిత్రానికి రీమేక్ కావడం గమనార్హం. ఇకపోతే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామనిదన్, జయం రవి సరసన సైరన్ చిత్రాలతో పాటు రఘు తాతా, రివాల్వర్ రిటా అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది మేలో తెరపైకి రావడానికి ముస్తాబోతోంది.