తిరుత్తణి: పట్టాభిరామపురంలో.....

18 Mar, 2023 01:26 IST|Sakshi
స్వామి ఉత్సవర్లను పూలవర్షంతో స్వాగతిస్తున్న మహిళలు

తిరుత్తణి: పట్టాభిరామపురంలో విహరించిన సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు గ్రామీణులు శుక్రవారం పూలవర్షంతో స్వాగతం పలి కారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లు శివారు గ్రామాల్లో ఏడాదిలో ఒక్కరోజు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించడం పరిపాటి. ఆ మేరకు పట్టాభిరామపురంలో స్వామి శుక్రవారం గ్రామంలో ఊరేగింపునకు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయ అనుమతించారు. దీంతో గ్రామంలో పండుగ సందడి నెలకింది. విద్యుద్దీపాలు, అరటి, మామడి తోరణాలతో గ్రామాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. కొండ ఆలయం నుంచి మేళ తాళాలతో స్వామివారు పట్టాభిరామపురం చేరుకున్నారు. గ్రామీణ మహిళలు పూలు చల్లి స్వామికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం గ్రామ మండపంలో స్వామికి విశిష్ట అభిషేక పూజలు చేసి సాయంత్రం స్వామివారు గ్రామ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి కొండకు సుబ్రహ్మణ్యస్వామి తిరుగుపయనమయ్యారు.

మరిన్ని వార్తలు