చైన్నెకి చేరిన బ్రిటీష్‌ యుద్ధనౌక

19 Mar, 2023 01:32 IST|Sakshi

కొరుక్కుపేట: బ్రిటీష్‌ యుద్ధనౌక హెచ్‌ఎంఎస్‌ తామర్‌ చైన్నెకు చేరుకుంది. 29వ తేదీ వరకు ప్రజలు దీన్ని సందర్శించవచ్చు. ఈ నౌక ఇటీవల నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడం విశేషం. ఢిల్లీలోని బ్రిటీష్‌ కమిషన్‌లోని నావికా సలహాదారు కెప్టెన్‌ ఇయాన్‌ లిన్‌తోపాటు హెచ్‌ఎంఎస్‌ తామర్‌ యుద్ధనౌక కెప్టెన్‌ టైల్‌ ఇలియట్‌ స్మిత్‌కు తమిళనాడు, పుదుచ్చేరి నావికా దళానికి చెందిన ఫ్లాగ్‌ ఆఫీసర్‌ రియల్‌ అడ్మిరల్‌ ఎస్‌. వెంకట రామన్‌ సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైన్నెలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, సహకారం గురించి అధికారులు చర్చించారు.

రూ. 2,017 కోట్లతో

కొత్త నీటి వనరులు

– చైన్నె కోసం కార్యాచరణ

సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 2,017 కోట్లతో కొత్త నీటి వనరులపై కార్పొరేషన్‌ దృష్టి సారించింది. వివరాలు.. చైన్నెకు పుళల్‌, చెంబరంబాక్కం, తేర్వాయి కండ్రిగ, తదితర రిజర్వాయర్లు, నిర్లవణీకరణ పథకం ద్వారా నీటిని శుద్ధీకరించి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చైన్నె నగరంలో నీటి అవసరాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నగరం మరింతగా విస్తరిస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లోని ప్రాంతాలు మెట్రో వాటర్‌బోర్డు పరిధిలోకి రానున్నాయి. దీంతో భవిష్య త్‌ను దృష్టిలో ఉంచుకుని చైన్నె నగరంలో నీటి వనరులను రూపొందించేందుకు కార్పొరేషన్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. రూ. 2,017 కోట్లతో ఈ పనులపై దృష్టి పెట్టనున్నారు. చైన్నె తీరంలోని జల వనరులు, నదులు, వాటి పరివాహక ప్రదేశాలను ఆధారంగా చేసుకుని నీటి వనరులు రూపొందించనున్నారు. అలాగే చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధిలోని చెరువుల పునరుద్ధరణతో ఆ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

మరిన్ని వార్తలు