షూటింగ్‌ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించిన స్థానికులు

20 Mar, 2023 01:56 IST|Sakshi

వేలూరు: సినీ నటుడు రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్‌లో తీస్తున్న సినిమా కోర్టు ప్రాంగణంలో తీసే సన్ని వేశాలు శనివారం ఉదయం తిరువణ్ణామలైలో సాగాయి. స్థానిక తాలుకా కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఇక్కడ బందోబస్తు కోసం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను అధిక సంఖ్యలో ఉంచారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయాలు జిల్లావ్యాప్తంగా విస్తరించడంతో ప్రజలు అధిక సంఖ్యలో తాలుకా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయాలను ప్రజలు సెల్‌ఫోన్‌లో నమోదు చేశారు. వీటిని గమనించి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న షూటింగ్‌ వీడియోలను తొలగించారు. అనంతరం తాలుకా కార్యాలయ ముఖద్వారంలో దారాలు కట్టి ఎవరూ లోనికి రాకుండా ఉండే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో తాలుకా కార్యాలయం ఆవరణలోని బాలికల వసతి గృహానికి విద్యార్థినులు వెల్లలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా తాలుకా కార్యాలయంలోని ఈ సేవా కార్యాలయానికి ప్రజ లు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందస్తుగా తాలుకా కార్యాలయంలో ముందస్తు గేట్లు పూర్తిగా మూసి వేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ మురుగేష్‌ వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవా లని సబ్‌ కలెక్టర్‌ సుమతిని ఆదేశించారు.

అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులు

తిరువణ్ణామలైలో వివాదం

మరిన్ని వార్తలు