చైన్నెలో మెగా సిటీ పోలీసు

20 Mar, 2023 01:56 IST|Sakshi

సాక్షి, చైన్నె: చైన్నెలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ‘మెగా సిటీ పోలీసు’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా కొత్తగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వివరాలు.. చైన్నె పోలీసు కమిషనర్‌గా శంకర్‌జివ్వాల్‌ బాధ్యతలు స్వీకరించినానంతరం నేరాల కట్టడికి విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే పోలీసు విభాగాన్ని బలోపేతం చేస్తూ వస్తున్నారు. చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ విభాగం పరనిధిలో 102 పోలీస్‌ స్టేషన్‌లలో 23,291 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు, 745 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్న సుమారు 71 లక్షల జనాభాకు రక్షణగా పోలీసు సేవలు విస్తృతం అయ్యాయి. ఇందులో భాగంగా శ్రీహ్యాపీనెస్ఙ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, మహిళా సాధికారత, మహిళా సంక్షేమం, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే, ‘రిమోట్‌ అప్‌ గ్రేటెడ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌’, ‘ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘన రసీదు వ్యవస్థ’, జియోకోడింగ్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలు వంటి కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఈ పరిస్థితులలో కొత్తగా మరిన్ని సేవలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ వివరాలను కమిషనర్‌ శంకర్‌జివ్వాల్‌ ఆదివారం స్థానికంగా వివరించారు.

అందుబాటులోకి ‘కొత్త’ సేవలు..

చైన్నె నగరం విస్తరిస్తుండడంతో మెగా సిటీ పోలీసు వ్యవస్థ ద్వారా భద్రత పరంగా చర్యలు కట్టుదిట్టం చేయనున్నారు. అలాగే, సాంకేతికతను అంది పుచ్చుకుని సరికొత్త యాప్‌లను రూపొందించడమే కాకుండా నేర గాళ్లను డేక కళ్ల నిఘాతో వెంటాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ. 32 లక్షలు వెచ్చించనున్నారు. దీని ఆధారంగా రౌడీలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడమే కాకుండా, వీరిని ఉక్కుపాదంతో అణిచి వేయడానికి సిద్ధమయ్యారు. అలాగే పరుందు వెలి యాప్‌ పేరిట దేశంలోనే ప్రప్రథమంగా నేరగాళ్లను ఏ, ఏప్లస్‌, బీ, బీప్లస్‌లుగా విభజించి వారితో సంబంధాలు ఉన్న వారి వివరాలన్నీ సేకరించనున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా వీరి కదలికలపై నిఘా ఉంచనున్నారు. అలాగే వాహనాల చోరీని కట్టడి చేయడమే లక్ష్యంగా 1.81 కోట్లతో ఐవీఎంఆర్‌ యాప్‌ రూపొందించనున్నారు. వాహనాలు చోరీకి గురైన పక్షంలో సకాలంలో వాటిని గుర్తించేందు కు వీలుగా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఆన్‌లైన్‌ మోసాల కట్టడే లక్ష్యంగా రూ. 29 లక్షలతో మరో యా ప్‌ను సిద్ధం చేయనున్నారు. దీని ఆధారంగా మోసాలకు పాల్పడే యాప్‌లను ఇట్టే పసిగట్టే వీలుంది.

మరిన్ని వార్తలు