తొలిసారి డ్రోన్‌లతో నిఘా..

20 Mar, 2023 01:56 IST|Sakshi

చైన్నెలో మొత్తం 312 చోట్ల సిగ్నల్‌ ఉన్నాయి. ఇక్కడ వాహన రద్దీ, ట్రాఫిక్‌ పద్మవ్యూహం వంటి వివరాలను తెలియజేయడమే కాకుండా, ప్రత్యేక్షంగా ట్రాఫిక్‌ పర్యవేక్షణ నిమిత్తం విభాగం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం రూ. కోటి నిధులను కేటాయించారు. దేశంలోనే ప్రపథమంగా డ్రోన్‌ నిఘా వ్యవస్థను పరిచయం చేయనున్నారు. అడయార్‌ బీసెంట్‌ అవెన్యూలో ఈ విభాగం ఏర్పాటు కానుంది. ఆరు ప్రత్యేక నిఘా డ్రోన్లు, ఓ హెవీ లిఫ్ట్‌ మల్టీ రోటర్‌ డ్రోన్‌, రెండు లాంగ్‌ రేస్‌ సర్వేవింగ్‌ డ్రోన్‌ అంటూ తొమ్మిది డ్రోన్‌లు పరిచయం చేయనున్నారు. ఇవి 5 నుంచి 10 కీ.మీ దూరం నిఘాను పర్యవేక్షించేందుకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో కూడి కెమెరాలను పొందు పరచనున్నారు. మెరీనా, బీసెంట్‌నగర్‌ వంటి బీచ్‌లలో గస్తీ నిమిత్తం ఏటీవీ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు