మహిళా న్యాయవాది హఠాన్మరణం

4 Jun, 2023 09:50 IST|Sakshi

తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా కన్నవరానికి చెందిన విమల్‌ కుమార్‌(50), భార్య భాగ్యలక్ష్మి (47) ఇద్దరూ న్యాయవాదులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం సహా రామేశ్వరం ఆలయానికి వెళ్లేందుకు చైన్నె వచ్చి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళుతున్నారు. రైలు కడలూరు జిల్లా పన్రుటికి రాగానే భాగ్యలక్ష్మికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చిందని తెలిసింది.

వెంటనే విమల్‌ కుమార్‌ ఈ విషయాన్ని రైలులోని టిక్కెట్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌కు చెప్పాడు. తదనంతరం రాత్రి 10.30 గంటలకు, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ తిరుపాదిరి పులియూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది (అక్కడ స్టాప్‌ లేదు). రైలు నుంచి దిగిన వెంటనే భాగ్యలక్ష్మిని అంబులెనన్స్‌లో కడలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు