పీజీ డాక్టర్‌ సింధుజ అనుమానాస్పద మృతి

1 Oct, 2023 08:32 IST|Sakshi
డా.సింధుజ (ఫైల్‌)

మైసూరు: కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలోని కొళ్లేగాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పీజీ చేస్తున్న డాక్టర్‌ సింధుజ (28) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని చైన్నెకి చెందిన వెంకటాచలం అనే వ్యక్తి కుమార్తె సింధుజ. తమిళనాడులో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తరువాత పరీక్షలు రాసి పీజీ అనస్తీషియా (మత్తు) కోర్సుకు అర్హత సాధించింది. గత 8 నెలల నుంచి కొళ్లేగాల ప్రభుత్వ ఉప విభాగం ఆస్పత్రిలో చదువుకుంటూ, శ్రీమహాదేశ్వర కాలేజీ రోడ్డులో అద్దె ఇంటిలో నివసిస్తోంది.

డ్యూటీకి రాకపోవడంతో..
సింధుజ శుక్రవారం ఆస్పత్రికి విధులకు రాలేదని, దీంతో మరో డాక్టర్‌ లోకేశ్వరి ఆమెకు కాల్‌ చేసినా స్పందన రాలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆస్పత్రి సిబ్బంది ఒకరికి చూసి రమ్మని ఆమె ఇంటికి పంపారు. తలుపు కొట్టినా ఎలాంటి సమాధానం రాకపోడంతో కిటికీలో నుంచి చూడగా సింధుజ నేలపైన బోర్లా పడి ఉంది. పక్కనే సిరెంజి, చాకు కనిపించాయి. పోలీసులు వచ్చి తలుపులు తీసి వెళ్లి చూడగా సింధుజ చనిపోయి పడివుంది. విషపూరిత ఔషధాలను తీసుకుని చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు