మహిళను వేధించిన యువకుడికి కత్తిపోట్లు

2 Oct, 2023 01:14 IST|Sakshi

తిరువొత్తియూరు: మహిళను వేధించిన యువకుడిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొలతూరు పూంబుగార్‌ నగర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ (25) ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమికుల మధ్య గొడవలు రావడంతో ఆమె అతనితో మాట్లాడడం మానేసింది. తీవ్ర ఆవేదనతో ఉన్న సంజయ్‌ కుమార్‌ ప్రియురాలి స్నేహితురాలైన అన్నానగర్‌కు చెందిన అభినయ (21)కు తరచూ ఫోన్‌ చేసి ప్రియురాలి సమాచారం కోరుతూ వేధించాడు. దీనిపై ఆగ్రహించిన మహిళ విషయాన్ని తన భర్త మోసెస్‌ (23)కు చెప్పింది. అభినయ, మోసెస్‌ అతని స్నేహితుడు సామివేలు (19) తదితరులతో కలిసి అన్నానగర్‌ న్యూ ఆవిడి రోడ్డులో నడిచి వెళుతున్న సంజయ్‌ కుమార్‌పై కత్తితో దాడి చేసి పారిపోయారు. గాయపడిన సంజయ్‌ కుమార్‌ను స్థానికులు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై అన్నానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మోసెస్‌, అతని భార్య అభినయ, స్నేహితుడు సామువేలును అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు