విద్యార్థిని ఆత్మహత్య

26 Feb, 2024 01:26 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న అభినయ

తిరుత్తణి: పాఠశాల వెళ్లలేదని తల్లిదండ్రులు మంద లించడంతో ఆవేదన చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తిరుత్తణి యూనియన్‌ వీరగనళ్లూరుకు చెందిన పాండ్యన్‌ పాల వ్యాపారి. అతని కూమార్తె అభియన(16) రాణిపేటలోని ఓ పాఠశాలలో ప్లస్‌–1 చదువుతోంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో అభినయ బడికి సక్రమంగా వెళ్లకుండా ఇంట్లో ఉండడంతో తండ్రి పాండ్యన్‌, తల్లి ఆషా మందలించినట్లు తెలుస్తోంది. దీంతో అభియన శనివారం ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో పొలానికి వినియోగించే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు