వైరలైన డెత్‌ యానివర్సరీ పోస్ట్‌..

18 Oct, 2020 12:48 IST|Sakshi

చైన్నై: ఓ వ్యక్తి తన డెత్‌ యానివర్సరీ కోసం రాసుకున్న పోస్ట్‌ వైరలైంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన ఇజ్జి కె ఉమామహేష్‌ శుక్రవారం మృతిచెందగా తన మరణానంతరం ప్రకటనల్లో ప్రచురించాల్సిన అంశాలను ముందుగానే రాసి పెట్టుకున్నారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు పత్రికలతో పాటు ఉమామహేష్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రచురించగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 

అతను ఏం రాశాడంటే..
తాను తన నియమాలకు అనుగుణంగా సమాజంలో మతరహిత పౌరునిగా జీవించినట్టు తెలిపారు. రీసైకిల్డ్‌ టీనేజర్‌గా, రేస్‌ రన్నర్‌గా‌, హౌస్‌మేకర్‌గా, పార్టీ హోస్ట్‌గా‌, ఫిల్మ్‌ యాక్టర్‌గా‌, రేషనలిస్ట్‌గా‌, హ్యూమనిస్ట్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్టు వివరించారు. జీవితం పార్టీలాంటిదని, ఎవరికైనా టైమ్‌ అయిపోతుందని, ఉన్నంతకాలం హ్యాపీగా జీవించాలని సూచించాడు. కాగా తనను తాను వాహనంగా పోల్చుకుంటూ తనలోని కొన్ని భాగాలు పని చేయడం లేదని, రిపేర్‌ చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నాడు. తన మరణానంతరం ఉపయోగపడే భాగాలను మరొకరికి డొనేట్‌ చేయాలని కోరాడు. అవయవదానం చేయాలనే ఉమామహేష్‌ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు