ఎస్‌ఈఆర్‌సీలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్‌ పోస్టులు

25 Feb, 2021 19:23 IST|Sakshi

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌–స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎస్‌ఈఆర్‌సీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»  మొత్తం పోస్టుల సంఖ్య: 14
»  పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌–08, డ్రైవర్‌–02, టెక్నీషియన్‌–04.

»  జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్‌ చేయాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు.

»  డ్రైవర్‌:  అర్హత: వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ–హెచ్‌ఎంవీ) ఉండాలి. మోటార్‌ మెకానిజం తెలిసి ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించకూడదు.

»  టెక్నీషియన్‌: అర్హత: కనీసం 55శాతం మార్కులతో సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎస్‌ఎస్‌సీ/పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో పని అనుభవం ఉండాలి.
»  ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
»  పరీక్షా విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్‌–1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్, పేపర్‌–2 జనరల్‌ అవేర్‌నెస్‌–జనరల్‌ లాంగ్వేజ్‌ విభాగాలు ఉంటాయి. మొదటి పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే పేపర్‌–2 వాల్యుయేషన్‌ ఉంటుంది. కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మెరిట్, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»   టెక్నీషియన్‌ పోస్టులకు ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్ష, డ్రైవర్‌ పోస్టులకు స్కిల్‌ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

»   దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీ, సీఎస్‌ఐఆర్‌ రోడ్, తారామణి, చెన్నై–600113 చిరునామాకు పంపించాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.03.2021
»    దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.03.2021
»    వెబ్‌సైట్‌: www.serc.res.in

మరిన్ని వార్తలు