నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా

24 Sep, 2020 12:43 IST|Sakshi

చెన్నై : తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు తేలింది. దీంతో చెన్నైలోని మియోట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ సందర్భంగా మియోట్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌  పృథ్వీ మోహన్‌దాస్ గురువారం విజయ్‌కాంత్‌ హెల్త్‌బులెటిన్‌ గురించి వివరించారు. 'విజయకాంత్‌కు  తేలికపాటి కరోనా లక్షణాలు వచ్చాయని .. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నాం ' అని తెలిపారు.

కాగా అంతకుముందు విజయకాంత్‌కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్‌ సాధారణ చెకప్‌ కోసమని ఎప్పటిలాగే మియోట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇందులో కరోనా సాధారణ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో వివరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. (చదవండి : భారత్‌లో 57 లక్షలు దాటిన కరోనా కేసులు)

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు