భారీ నగదుతో పరుగులు తీసిన డీఎస్పీ.. విషయం ఏంటంటే..

10 Sep, 2021 06:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూర్‌: తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుచి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉంది. ఇక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తాడు.

ఇది చూసిన పోలీసులు అతన్ని వెంబడించి.. పట్టుకున్నారు. విచారణలో పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం అతను మాట్లాడుతూ... తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి..  విజిలెన్స్‌ అధికారులు అనుకొని నగదుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లుగా తెలిపాడు. దీంతో డీఎస్పీ తో పాటు.. అతని స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

చదవండి: శునకం నోటిలో పసికందు తల

మరిన్ని వార్తలు