50 అడుగుల బావిలో గున్న ఏనుగు

20 Nov, 2020 08:59 IST|Sakshi

13 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన అధికారులు

సాక్షి, సేలం(తమిళనాడు): తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. అటవీశాఖ సిబ్బంది 13 గంటల పాటు శ్రమించి ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. పాలక్కోడు సమీపంలోని ఏలకుండూర్‌ గ్రామంలో 50 అడుగుల లోతైన బావి ఉంది. గురువారం నీటి కోసం వచ్చిన ఒక ఆడ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి బావిలో ఉన్న నీటిని మోటార్లతో బయటకి తోడేశారు. ఏనుగుకు రెండు మత్తు సూదులు ఇచ్చి క్రేన్‌ల సహాయంతో బావిలోంచి అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం ఏనుగుకు వెటర్నరీ వైద్యులు చికిత్స చేశారు.   (ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వైరల్‌ వీడియో)

మరిన్ని వార్తలు