భారీ పేలుడు ఐదుగురు సజీవ దహనం

23 Oct, 2020 16:45 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో.. అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్‌ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు