శాసనసభాపక్ష నేతగా స్టాలిన్‌ ఎన్నిక

5 May, 2021 21:08 IST|Sakshi

చెన్నె: పదేళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారం చేపట్టనుంది. ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ ఎన్నికయ్యాడు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ స్టాలిన్‌కు ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్‌ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొద్దిమంది సమక్షంలోనే గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌లో స్టాలిన్‌ ప్రమాణం చేయనున్నారు. 

స్టాలిన్‌తో పాటు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఏకంగా స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ కన్నా అధిక సీట్లు ఉన్న డీఎంకేను అధికారం చేపట్టాలని గవర్నర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు బుధవారం ఉదయం స్టాలిన్‌ను తమ ఎమ్మెల్యేలంతా తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న పత్రాన్ని గవర్నర్‌కు అందించారు.

చదవండి: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత

చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి

గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌కు శాసనసభ పక్ష తీర్మాన ప్రతిని అందిస్తున్న కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు