కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రజలపై కాల్పులా..?

14 Sep, 2021 07:56 IST|Sakshi

స్టెరిలైట్‌ వ్యవహారంలో హైకోర్టు 

సాక్షి, చెన్నై: కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రజలపై కాల్పులు జరపడం భావ్యం కాదని మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూత్తుకుడిలో స్టెరిలైట్‌పరిశ్రమకు వ్యతిరేకంగా 2018లో జరిగిన ఉద్యమ ర్యాలీ తుపాకీ కాల్పులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ  వ్యవహారం సీబీఐ విచారణలో ఉంది. మానవ హక్కుల కమిషన్‌తో పాటుగా గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిషన్‌ సైతం  ఈ ఘటనపై దర్యాప్తు చేశాయి.

అదే సమయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, మానవ హక్కుల సంఘాల విచారణకు అడ్డంకులు, నివేదికలు  తదితర వ్యవహారాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. సోమవారం ఇవి విచారణకు రాగా, ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ బెంచ్‌ తీవ్రంగానే స్పందించింది. కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రజల మీద కాల్పులా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భావ్యం కాదు అని, ప్రభుత్వాలపై కార్పొరేట్‌ సంస్థలు ఆధిక్యాన్ని ప్రదర్శించ కూడదని పేర్కొంటూ, ఈ కాల్పుల్ని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి నష్ట పరిహారం పెంపు మీద దృష్టి పెట్టాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. 

దివ్యాంగుల కోసం.. 
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కలి్పంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజే సంజీబ్‌ బెనర్జీ బెంచ్‌ విచారించింది. వాదనల అనంతరం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు తప్పనిసరి అని ప్రభుత్వానికి బెంచ్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే 54శాతం మేరకు ఏర్పాట్లు జరిగాయని, ఏడాదిలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. లుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు