భారీ శబ్దంతో పిడుగు.. భార్య తేరుకునేలోపే భర్త దుర్మరణం

18 Jul, 2021 14:28 IST|Sakshi
రాందాస్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

కలుపు తీస్తుండగా పిడుగుపాటు

విగతజీవిగా మారిన భర్త

కొటాలగూడెంలో ఘటన

అనంతగిరి: దంపతులిద్దరూ పొలంలో కలుపుతీస్తున్నారు.. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు.. మెరుపులు.. ఒక్కసారిగా పిడుగుపాటు.. తేరుకునేలోగా భర్త విగతజీవిగా కనిపించాడు. తట్టుకోలేక గుండెలవిసేలా రోదించిన భార్య.. ఈ ఘటన వికారాబాద్‌ మండలం కొటాలగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొటాలగూడెంలో రాందాస్‌(45), భార్య రామిబాయిలు వ్యవసాయం చేస్తూ జీవనం  సాగిస్తున్నారు. తనకున్న ఎకరన్నర పొలంలో పత్తి పంట వేయడంతో భార్యతో కలిసి పొలానికి వెళ్లి  కలుపుతీసే పనిలో నిమగ్నమయ్యాడు.

సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చి  పిడుగుపడటంతో రాందాసు అక్కడికక్కడే కుప్పకూలాడు. పక్కనే ఉన్న భార్య శబ్దం నుంచే తేరుకునే లోపే భర్తవిగత జీవిలా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యింది. రోదనలు విన్న చుట్టుపక్కలా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ రాములు నాయక్‌  పోలీసులకు ఫోన్‌ చేయగా  ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈమేరకు   దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు