తమిళనాడుకు మరో తుపాను హెచ్చరిక! రానున్న 48 గంటల్లో..

28 Nov, 2021 12:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్‌ 29 నాటికి మరో తుపాన్‌ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్‌ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా.

 

అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

 

మరిన్ని వార్తలు