ప్రధాని మోదీ ఫొటోపై వివాదం.. భగ్గుమన్న బీజేపీ.. వీడియో వైరల్‌

14 Apr, 2022 20:40 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అధికార డీఎంకే పార్టీ నేతలు ప్రభుత్వ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది. 

వివరాల ప్రకారం.. ఇటీవల తంజావూరు జిల్లాలోని వేప్పత్తూర్ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు. కాగా, పంచాయతీ చైర్‌పర్సన్‌ అంజమ్మాళ్ తన భర్త ఆదేశాల మేరకు మోదీ ఫొటోను తొలగించారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

ఇదిలా ఉండగా..బీజేపీ కౌన్సిలర్ ఎస్ చంద్రశేఖరన్..  ప్రధాని మోదీ ఫొటోను కార్యనిర్వాహక అధికారికి ఇచ్చి పంచాయతీ ఆఫీసులో పెట్టాలని కోరాడు. దీంతో ఆయన పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన చైర్‌పర్సన్‌ అంజమ్మల్.. మోదీ ఫొటోను తొలగించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఈ క్రమంలో అధికార డీఎంకే పార్టీకే బీజేపీ నేతల మధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పంచాయతీ కార్యాలయంలో మోదీ ఫొటోను తిరిగి ఏర్పాటు చేశారు. ఈ వివాదం రాష్ట్రంలో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీయగా.. డీఎంకే అధిష్టానం నేతలకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇలాంటి చర్యలతో బీజేపీ ఎదుగుదలకు అకాశం ఇవ్వవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు డీఎంకే సూచించింది.

మరిన్ని వార్తలు