కరోనాతో మరణించిన పోలీసు కుటుంబాలకు రూ.25లక్షలు..

21 May, 2021 15:15 IST|Sakshi

చెన్నై: కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 36  మంది పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్‌ డ్యూటీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులతో సహా మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొలుత 13 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు 36 మంది పోలీసుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని స్టాలిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 35 మంది పోలీసుల కుటుంబాలకు కూడా త్వరలో ఆర్థికసాయం అందిస్తామని స్టాలిన్‌ తెలిపారు.

(చదవండి:రాజీవ్‌ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్‌)

మరిన్ని వార్తలు