కొత్త సీఎం స్టాలిన్‌: తొలి ఐదు సంతకాలు వీటిపైనే..

7 May, 2021 17:03 IST|Sakshi

చెన్నె: అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ముతువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తన తండ్రి స్మృతిస్థలి వద్ద కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా తొలి సంతకాలు వేటిపై చేశారనే ఆసక్తి అందరిలో ఉంది. 

  • మహమ్మారి కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద మే, జూన్‌ నెలలకు సంబంధించి రూ.4 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది. రెండు విడతలుగా ఆ సహాయం అందించనున్నారు. 2.7 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
     
  • తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బీమా ఉన్న వారందరికీ కరోనా చికిత్సకయ్యే ఖర్చంతా భరిస్తుందనే ఫైల్‌పై స్టాలిన్‌ సంతకం చేశారు. 
     
  • సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణానికి సంబంధించిన ఫైల్‌పై సీఎంగా స్టాలిన్‌ సంతకం చేశారు. మే 8వ తేదీ నుంచి మహిళలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 
     
  • పాల ధర తగ్గింపుపై స్టాలిన్‌ సీఎంగా సంతకం చేశారు. మే 16 నుంచి లీటర్‌పై మూడు రూపాయలు తగ్గనున్న ధర.
     
  • ‘మీ నియోజకవర్గ ముఖ్యమంత్రి’ అనే సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. దీనిపై ఐదో సంతకం చేశారు. ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్ణయం. వంద రోజుల్లోపు ఆ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి. 


చదవండి:
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్‌ తగ్గినట్టేనా..?

‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’

మరిన్ని వార్తలు