ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్‌

5 Oct, 2020 16:30 IST|Sakshi

'జోకర్‌' మాల్‌వేర్‌ను గుర్తించిన గూగుల్‌

మొబైళ్ల నుంచి అన్‌ఇన్‌స్టాల్‌ చేయకపోతే ముప్పు ఖాయం

సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మీకు నచ్చిన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్‌ పడితే ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్‌ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్‌వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్‌' మాల్‌వేర్‌ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. 

ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే..
'జోకర్‌' మాల్‌వేర్‌ అత్యంత ప్రమాదకరమైనదని టెక్‌ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్‌' బారిన పడితే మీ మొబైల్‌ ఇక మీ మాట వినదు. మొబైల్‌లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్‌వేర్‌ యాక్సెస్‌ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్‌ అకౌంట్‌లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్స్‌.. అదుర్స్‌)

ఇప్పటికే లక్షా 20 వేల డౌన్‌లోడ్స్‌
ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్‌ పరీక్షించింది. 17 యాప్స్‌ భారీగా ఇన్‌ఫెక్ట్‌ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్‌.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని సూచిస్తోంది. 

ఇటీవల గూగుల్‌ గుర్తించిన 17 ఇన్‌ఫెక్టెడ్‌ యాప్స్‌ ఇవే..
  

  • One Sentence Translator - Multifunctional Translator
  • Style Photo Collage
  • Meticulous Scanner
  • Desire Translate
  • Talent Photo Editor - Blur focus
  • Care Message
  • Part Message
  • Paper Doc Scanner
  • Blue Scanner
  • Hummingbird PDF Converter - Photo to PDF
  • All Good PDF Scanner
  • Mint Leaf Message-Your Private Message
  • Unique Keyboard - Fancy Fonts & Free Emoticons
  • Tangram App Lock
  • Direct Messenger
  • Private SMS
మరిన్ని వార్తలు