వాట్సాప్‌ డేటా హ్యాకింగ్‌ను అడ్డుకోండిలా..

7 Oct, 2020 16:11 IST|Sakshi

సెట్టింగ్స్‌లో చిన్న మార్పుతో మీ డేటా సేఫ్

న్యూఢిల్లీ:  సైబర్‌ ప్రపంచాన్ని హ్యాకర్లు హడలెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సైతం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని వాట్సాప్‌ డెవలపర్లు చెబుతున్నా ఆ ఫీచర్‌.. పేరుకే పరిమితమవుతోంది. మనం చేసే మెసేజులు, పంపించే వీడియోలు మూడో వ్యక్తి కంటపడవని వాట్సాప్‌ ప్రకటిస్తున్నా హ్యాకర్లు ఈజీగా తమ పని కానిచ్చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్‌ గ్రూప్‌'పై కేసు)

ఇటువంటి తరుణంలో వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో చిన్నచిన్న మార్పులు చేస్తే ఇక మీ చాటింగ్‌ మొత్తం సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాట్సాప్‌లోని చాటింగ్‌ డేటా డిఫాల్ట్‌గా ప్రతిరోజూ గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాకప్‌ అవుతుంటుంది. గూగుల్‌ డ్రైవ్‌లోని సమాచారానికి కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని చెబుతున్నా ఇక్కడి నుంచే ఎక్కువగా యూజర్ల డేటా లీక్‌ అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాట్‌ డేటా బ్యాకప్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. దీని కోసం ఏం చేయాలంటే...

  • ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ 'ఆప్షన్‌' క్లిక్‌ చేయాలి. 
  • ఇప్పుడు మరో మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో డార్క్‌ కలర్‌లో కనిపించే 'బ్యాకప్‌'పై క్లిక్‌ చేయాలి. 
  • మొత్తం ఐదు ఆప్షన్లు ఓపెన్‌ అవుతాయి. అందులో 'never' లేదా 'only when i tap backup' ఆప్షన్లను సెలెక్ట్‌ చేసుకోవాలి. 
  • ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేస్తే ఇకపై ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ ప్రాసెస్‌ జరగదు. చాటింగ్‌ డేటా కూడా గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ అవదు. 
  • ఒకవేళ ఎప్పుడైనా చాటింగ్‌ డేటా బ్యాకప్‌ తీసుకోవాలనుకున్నా వైఫై ద్వారా కాకుండా మొబైల్‌ డేటా ద్వారానైతే హ్యాకర్ల బారిన పడకుండా నిరోధించవచ్చు. 
మరిన్ని వార్తలు