-

బండ్ల గణేష్‌ పొలిటికల్‌ ట్వీట్‌.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!

25 Jun, 2023 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ మరోసారి పొలిటికల్‌ కామెంట్స్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా కామెంట్స్‌ చేశారు. దీంతో,  ఆయన మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అయినట్టు తెలుస్తోంది.

అయితే, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు బండ్ల గణేశ్‌ తెలిపారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.  

ట్విట్టర్‌లో ‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.  అని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన కేసీఆర్‌ సర్కార్‌

మరిన్ని వార్తలు