శేజల్‌తో బీఆర్‌ఎస్‌ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్‌!

24 Jun, 2023 09:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్‌ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమపై కేసులు పెట్టించారని గత రెండు నెలలు నుంచి పలు రకాలుగా ఆందోళన చేస్తున్న ఆరిజన్‌ నిర్వాహకురాలు శేజల్‌తో బీఆర్‌ఎస్‌ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. 

బీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌లు శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని, అలాగే ఆమెకు న్యాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యకు షాక్‌!

మరిన్ని వార్తలు