ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్‌రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు

2 Jun, 2023 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది.

కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్  కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ
వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత  కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ  కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు  కోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు