తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్‌ తమిళిసై డ్యాన్స్‌

2 Jun, 2023 17:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రముఖుల మధ్య గవర్నర్ కేక్ కట్ చేశారు. వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డ్యాన్స్‌ వేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. గవర్నర్‌ తమిళిసైకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అనంతరం గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు  గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు తమిళిసై పాదాభివందనం చేశారు.

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మందికిపైగా ప్రాణ త్యాగం చేయడం తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఆనాడో తెలియజేస్తుందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంటే స్లోగన్‌ కాదని, ప్రజల ఆత్మగౌరవ నినాదామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
చదవండి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు