దేశంలోనే వేగంగా హైదరాబాద్‌ ప్రగతి

7 Jul, 2023 03:24 IST|Sakshi

ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో ఊహించని అభివృద్ధి

జనాభాలో మలేసియాతో, విస్తీర్ణంలో సౌత్‌కొరియాతో తెలంగాణ సమానం

ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు

మాదాపూర్‌: భారతదేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా హైదరాబాద్‌ గు ర్తింపు సాధించిందని, భవి ష్యత్తులో మరింత ప్రగతిని సాధిస్తుందనే నమ్మకం ఉందని మంత్రి కేటీ రామారావు అన్నారు.

మాదా పూర్‌లోని హెచ్‌ఐసీసీలో  గురువారం రాత్రి టీహబ్‌ ఆధ్వర్యంలో టీ–ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ ‘గ్లాడియేటర్స్‌ ఆఫ్‌ మైండ్‌’ అనే అంశంపై రెండవ ఎడిషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి కేటీరామారావు మాట్లాడుతూ కేవలం ఒక్క ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయం, ఇతర రంగాలలో అనూహ్య ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపును సాధించిందన్నారు.  

2014లో ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లు ఉండగా 2023 మే నాటికి రూ.2.41 లక్షలకు పెరిగాయని, అదే విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలోనూ ఎంతో ప్రగతిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రకారం మలేషియా దేశంతో సమానం కాగా, విస్తీర్ణంలో సౌత్‌కొరియాతో సమానమని మంత్రి పేర్కొన్నారు.

యాట కూర తిన్నాక....తోట కూర తింటే.. 
సోషల్‌ మీడియా స్టార్‌ మంత్రి మల్లారెడ్డి మా ట్లాడాక ఇక మాకు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని.. ‘యాట కూర తిన్నాక తోటకూరన్న ప్రాధాన్యత లాగా ఉంటుందని. అదేవిధంగా క్రికెట్‌లో సూర్యకుమార్‌యాదవ్‌ బ్యాటింగ్‌ చేశాక స్లో ఆడే ఇండియన్‌ క్రికెటర్‌ ఆడితే ఎలా ఉంటుందో నేను మాట్లాడితే అలా ఉంటుందని కేటీఆర్‌ చలోక్తి విసురుతూ అందరినీ నవ్వించారు. కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, టీహబ్‌ సీఈఓ శ్రీనివాసరావు, సైయింట్‌ అధినేత బీవీమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు